Bobby 's

My Styles

www.scraps99.com (profile_flash_effect)

My Status

Monday, December 27

Na Kadha


http://nakadha.blogspot.com

ఇది నిజంగా జరిగిన ప్రేమ జంట ఆవేదన . ఇది జరిగి ఇప్పటికి సరిగ్గా పదముడువందాల నలభై సంవత్సరాలు అయ్యింది . అప్పుడు చనిపోయిన మా శరీరాలు కాలి బూడిద అయిన మా ఆత్మలులో ఒక ఆత్మ భూమిని చేరినా ఇంక నేను ఒక ఆత్మలాగా ఈ మనుషుల మద్య , వారి చుట్టూ తిరుగుతున్నాను . ఇప్పుడు మీకు చెబుతున్న ఇ మాటలు స్వయంగా నేను అనుభవించినవి అవి మా జంట పడిన బాధలు .ఇన్ని సంవత్సరాలు గడిచినా నా ఆత్మ ఇంక ఈ నిశబ్ద వినీలాకాశములో ప్రయానిస్తూనే ఉంది కారణం కొందరు మానవమృగాలు, నా అనుకున్నవాళ్ళు చేసిన కిరాతక పనులకు సాక్షముగా మా జంట బలి అయ్యింది దానికి సాక్ష్యముగా నేను మిగిలాను.ఇప్పటి నుండి నేను మా పట్ల జరిగిన ఆ కిరతకాన్ని మీతో చెప్పుకుంటాను ఆ మానవమృగాలు ఫై పగ ఎలా తిర్చుకున్నాను, నా జంటను నేను ఎలా కలుసుకున్నాను అని చెపుతాను . కానీ నేను చేసిన కొన్ని తప్పులు వల్ల నేను ఒక ఆత్మగా మిగిలి ఎంతో వ్యధను అనుభవిస్తున్నాను. కొంతమంది మనుషులను హింసిస్తూ చంపుతూ ఇప్పటికీ ఒక ఆత్మగానే మిగిలి ఉన్నాను .

అది మూడనమ్మకాలు రాజ్యమేలుతున్న రోజులు కొందరి మానవమృగాలు చేసిన ఆకృత్యాలకు నిదర్శనం ఆ రోజులు . దేవుడు కంటే మరేదో శక్తివంతమైనది ఉంది అని నమ్మి కొందరిని చంపడం ,బ్రతికిఉండగానే కాల్చడం ,పేకలు శరీరం నుంచి పీకిపరెయ్యడం , గర్భిణి స్త్రీలను బలి ఇవ్వడం ,పసిపిల్లలను భూమిలో పాతిపెట్టుట ఇలాంటి ఆకృత్యాలకు కొన్ని ప్రాణాలు బలి అయ్యాయి . వారు చేసిన ఆపనులు కొన్ని ప్రళయలుకు ,ప్రకృతి వైపరిత్యలకు కారణమయ్యాయి. వారు అనుకున్నవి సిద్దించలేదు కారణం ఈ ప్రపంచములో దేవుడిని మించిన అతీతశక్తి లేదు. మన చావు పుట్టుకులను శాసించేది ఆ దేవుడే . "నా కథ" గురుంచి నేను మీతో చెప్పాలి. నేను కూడా ఆ మనుషుల మధ్య పెరిగినదననే వాళ్ళలో కొందరి వాళ్ళ నేను ఈ రోజు ఇలా ఒక ఆత్మలా సంచరిస్తున్నాను .


నా పూర్తి పేరు సాంద్ర సిందు అందరు నన్ను సాంద్ర అని పిలిచేవారు. మా నాన్నఅంటే నాకు చాల ఇష్టం ఆయనే నాకు మంచి నేస్తం మా నాన్న పేరు రాజయ్య  ,అమ్మ పేరు అణగ నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. ఇకపొతే నాచెల్లెలు ప్రణతి చాల అల్లరి పిల్ల కానీ తెలివైనది ,నా తమ్ముడు సాదు మంచివాడు నన్ను అక్కా అని పిలవడు అమ్మా అని పిలుస్తాడు వాడు అంటే నాకు ఎంతో ఇష్టం . కానీ వాడికి దేవుడు ఒక లోపం పెట్టాడు వాడికి కళ్ళు లేవు అందుకే వాడిని నేను కంటికి రెప్పలాగా చూసుకుంటాను ఇదే నా అందమైన కుటుంబం. మా ఊరు ఆంధ్రప్రదేశ్ లోని ఒక అడవి మధ్యలో ఉంటుంది బయట ప్రపంచానికి దూరంగా ,దట్టమైన అడవుల మధ్య ప్రకృతి ఒడిలో కొండలు, లోయలు పచ్చని చెట్లు , చెక్క ఇల్లులు, పెంపుడు జంతువులతో మా ఊరు ఉంటుంది .మా ఊరి పేరు "యేరుసెల్ల". నా కుటుంబం అందమైనది అయిన నా ఉరు బయకంపితముగా ఉంటుంది .



                                                                             
                                                                          మా ఊరికి కొంచెం దూరముగా ఉంటుంది గణ్య కోన.అక్కడే ఉంటాడు 'గణ్యు' వీడే క్షుద్ర దేవతలను ఆరదించేవాడు. వాటి కోసం ఎంతో మందిని బలి కూడా ఇచ్చాడు. వాడి శరీరం బుడిదతో నిండి ఉంటుంది.అరున్నరడుగుల ఎత్తు,పొడవాటి గిరిజాల జుట్టు ,పెద్ద పెద్ద గోరులుతో ,ఎర్రనికళ్ళతో,బలమైన శరీరంతో,మెలికలు తిరిగిన కండలతో ఉంటాడు.వాడు మనుషులకు సాదారణముగా కనిపించడు ఒకవేళ కనిపిస్తే వాడిని చూసిన వారి శరీరంలో ప్రవహించేది రక్తం కాదు భయం .వాడికి ఏ అవసరం వచ్చిన చేయడానికి మా ఊరిలో మనుషులు ఉన్నారు వారి ద్వారానే వాడు అన్ని పనులు చేయిచుకుంటాడు.అల వాడికి సహాయపడే వారిలో ప్రముఖుడు 'ఖ్రుగ్ను' .వీడు గణ్యు అగ్ర శిష్యుడు అంతేకాక వాడు ఆ గణ్య కొనలో నియంతలాగా  వ్యవహరిస్తాడు.       


                                          గణ్యు క్షుద్ర దేవతలను ఆరాదిస్తాడు అంతేకాదు వాడికి వచ్చిన విద్య    వశీకరణం.నా తండ్రి ఆయుర్వేద వైద్య నిపుణులు మా ఊరిలో ఎవరికీ ఎ వ్యాది వచ్చిన నా తండ్రి అ వ్యాధిని నయము చేసేవాడు . ఆయుర్వేద చరిత్ర మన భారత దేశములో  పుట్టి ఇప్పటికి కొన్ని యుగాలు గడుస్తున్న దాని ప్రాదాన్యత దానికి ఉంది .


                                     
                                                                                 
                                                              




Friday, December 17

Pic




Posted by Picasa

Tuesday, May 11